దేశంలో తీవ్ర నీటి ఎద్దడి రానుందని ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ నివేదిక హెచ్చరిస్తోంది. 2030 నాటికి దేశ జనాభాలో 40 శాతం మందికి కనీసం తాగు నీరు దొరకదని నివేదికలో వెల్లడైంది. 2020 నాటికి దిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి 21 నగరాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతాయని పేర్కొంది. సరైన వర్షాలు లేకపోవటం వల్ల దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతోంది. భూగర్భ జలాలపై ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ నివేదిక చేదు వార్తను వెల్లడించింది. నీటి వనరుల రక్షణ చర్యలు చేపట్టకుంటే... 2020 నాటికి దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి 21 నగరాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతాయని పేర్కొంది. నివేదిక ప్రకారం 2030 నాటికి దేశ జనాభాలో 40 శాతం మందికి కనీసం తాగు నీరు దొరికే పరిస్థితులు లేవని హెచ్చరించింది. నీటి వనరుల సంరక్షణ చర్యలు చేపట్టకుంటే తీవ్ర నీటి ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. 2020 ఎంతో దూరంలో లేదు. ఇప్పటి నుంచే చర్యలు చేపట్టక తప్పదు. చెన్నైలో మూడు నదులు, నాలుగు నీటి వనరులు పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. గుక్కెడు నీటి కోసం ప్రజల...
Get latest updates news, movies, sports, Technology, Android, How to...and more