Skip to main content

Posts

Showing posts from July 26, 2019

షంక్షన్‌లో వచ్చిన చదింపులతో ఈ వ్యక్తి కోటీశ్వరుడైపోయాడు.. ఎంత వచ్చాయంటే.. :

తమిళనాడులో ఓ విందు కార్యక్రమానికి వచ్చిన చదివింపులతో ఓ వ్యక్తి కోటీశ్వరుడుగా మారినట్లు ఈనాడు దినపత్రిక ఓ కథనం రాసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే, బంధు మిత్రులు చదివింపుల ద్వారా వారికి ఆర్థిక సాయం చేస్తారు. తమిళనాడులోని పుదుక్కోట జిల్లా కీరామంగళం తాలూకాలోని వడగాడు, పరిసర గ్రామాల్లో ఈ సంప్రదాయం ఉంది. మొగుడితో మోటు సరసం.. పోలీసుల అదుపులో భార్య, నడవలేని స్థితిలో భర్త! వడగాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి గురువారం తన బంధుమిత్రులు, గ్రామస్థులకు ఇలాగే విందు ఏర్పాటుచేశారు. సుమారు 50,000 ఆహ్వాన పత్రికలను ముద్రించి పంచారు. విందు కోసం 1000 కిలోల మేక మాంసాన్ని సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం కోసం ఆయన రూ.15 లక్షలు ఖర్చుపెట్టారు. దాదాపు ఐదు వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారు ఇచ్చిన చదివింపుల రూపంలో కృష్ణమూర్తికి ఏకంగా రూ.4 కోట్లు వచ్చాయి. డబ్బులు లెక్కించేందుకు కౌంటింగ్ మెషిన్స్‌ను, బ్యాంకు ఉద్యోగుల సేవలను ఆయన వినియోగించుకున్నారు. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు.