జియో తాజాగా ప్రకటించిన సేవలన్నీ సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
అతి తక్కువ ధరలతో 'ఫైబర్ టూ ఆఫీస్' సేవలు కూడా ప్రారంభించబోతోంది.
ఇప్పటివరకూ స్టార్టప్‌లు నెలకు రూ.15 వేల వరకూ ఇంటర్నెట్ బిల్లులు చెల్లించేవి . కానీ జియో ఫైబర్ టూ ఆఫీస్ సేవలు కేవలం నెలకు రూ.1500 రూపాయల టారిఫ్‌తోనే ప్రారంభం కానున్నాయి
ఇంట్లోనే హోం థియేటర్ ఎప్పటి నుంచి
ఇంట్లోనే నేరుగా సినిమా మొదటి రోజే చూసే సేవలను 2020 నాటికల్లా అందిస్తామన్నారు.
ఇక జియో గిగా ఫైబర్ నెట్‌తో వచ్చే ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి దేశంలో అన్ని నెట్ వర్క్‌లకు పూర్తిగా ఔట్ గోయింగ్ ఉచితంగా అందించబోతున్నామని, యూఎస్, కెనడా వంటి దేశాలకు అన్ లిమిటెడ్ కాలింగ్ నెలకు కేవలం 500 రూపాయలకే అందించబోతున్నట్లు వెంకటరెడ్డి చెప్పారు.
'వన్ ఇయర్ వెల్ కం' ప్లాన్ కింద ఏడాది సబ్ స్క్రిప్షన్ తీసుకునే వినియోగదారులకు ఒక 4కే లేదా హెచ్‌డీ టీవీ సెట్ టాప్ బాక్స్ తో పాటు ఏడాది ప్లాన్ కూడా ఉచితంగా అందివ్వబోతున్నట్లు తెలిపారు.
Get latest updates news, movies, sports, Technology, Android, How to...and more
Comments
Post a Comment